కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

వేములవాడ :

రాష్ట్ర ప్రభుత్వ విప్ అది.

WhatsApp Image 2025-10-05 at 6.39.51 PM

కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని, స్థానిక ఎన్నికల్లో గెలుపుకోసం సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలో ఎస్అర్అర్ గ్రాండ్ లో వేములవాడ అర్బన్, రూరల్ మండలాల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పలు సూచనలను దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఎన్నికల్లో పెద్ద పీట వేసేలా బీసీ రిజర్వేషన్లు కల్పించారని,తద్వారా అనేక మంది బలహీన వర్గాలకు చెందిన వారికి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సి ఎస్టీలు ఎదురు చూసిన వర్గీకరణ అమలు చేసారని తెలిపారు.ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చెప్తూ ముందుకు పోవలన్నారు.కష్టపడ్డ ప్రతి ఒక్కరికి తప్పకుండా న్యాయం చేస్తానని తెలిపారు.అందరికి తప్పకుండా అవకాశాలు వస్తాయని రానున్న ఇంకో 10 సంవత్సరాల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలిపారు.కార్యకర్తలు, నాయకులు చెప్పే సూచనలు సలహాలు స్వీకరిస్తూ ముందుకు పోతామన్నారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడుగా పని చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.ఈ ఎన్నికల్లో అవకాశం రానివారు ప్రస్తుతం అవకాశం వచ్చినా అభ్యర్థుల గెలుపునకు దోహదం చేయాలన్నారు.ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం, వారు దిగజారి మాట్లాడే మాటలు పట్టించుకోకుండా ముందుకు పోవలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేద ప్రజలకు అందేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రజలకు చేరువలో ఉండాలన్నారు.పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలిపారు.

Read More ఘనంగా శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

About The Author