దుస్తులను విరాళంగా ఇద్దాం.. దీపావళిని అర్థవంతంగా చేద్దాం

- వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గీతం స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్

సంగారెడ్డి : 

WhatsApp Image 2025-10-07 at 6.28.37 PM

దుస్తులను విరాళంగా ఇవ్వడం ద్వారా ఈ దీపావళిని అర్థవంతంగా, స్ఫూర్తిదాయకంగా మారుద్దామని హైదరాబాదు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ పిలుపునిచ్చింది. శ్రేయస్సు కోసం దుస్తుల అలమార (వార్డ్ రోబ్ ఫర్ వెల్ నెస్) ఇతివృత్తంగా, స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ ఆలోచనాత్మక దుస్తుల విరాళ కార్యక్రమం ద్వారా కాంతి, ఆశను వ్యాప్తి చేయడానికి విద్యార్థులను వారి హృదయాలను, దుస్తుల అలమార (వార్డ్ రోబ్)లను తెరవమని ఆహ్వానిస్తోంది. వస్త్రనోవా, చరైవేతి అనే రెండు ఉత్సాహభరితమైన విద్యార్థి క్లబ్ ల సహకారంతో, ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 7 నుంచి 9వ తేదీ వరకు గీతం ప్రాంగణంలోని కేఫ్ కనెక్షన్స్ లో నిర్వహిస్తున్నారు.తమ సున్నితమైన దుస్తులను – చొక్కాలు, జాకెట్లు, లేదా మరొకరికి ఓదార్పు, గౌరవాన్ని తీసుకురాగల ఏదైనా వస్త్రాలను దానం చేయమని గీతం విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.ప్రతి వస్త్రం ఒక కథ చెబుతుంది – దానిని పంచుకున్నప్పడు, అది వేరొకరి జీవితంలో వెచ్చదనాన్ని ఇస్తుంది’ అని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ‘ఈ దీపావళికి దయను ట్రెండ్ గా మార్చి, అర్థవంతంగా చేద్దాం – ప్రకాశాన్ని వ్యాప్తి చేద్దాం’ అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా సానుభూతి, సమాజ సంరక్షణ, స్థిరమైన జీవన సంస్కృతిని గీతం పెంపొందించడంతో పాటు కరుణామయ చర్యల ద్వారా ప్రకాశవంతమైన దీపాలను వెలిగించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తోంది.

Read More తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొనాలి

About The Author