ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పర్యటించనున్న ప్రాంతాల పరిశీలన..

జిల్లాలోని వివిధ ప్రాంతాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్..

కామారెడ్డి : 

WhatsApp Image 2025-09-03 at 6.43.59 PM

ఈనెల 4 వ తేదీ గురువారం నాడు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పర్యటించనున్న జిల్లాలోని వివిధ ప్రాంతాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. తాడ్వాయి మండలం  ఎర్ర పహాడ్ వద్ద ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్ దిగేందుకు   ఏర్పాటుచేసిన హెలిపాడ్ ను పరిశీలించి ఇన్చార్జిలుగా చూసుకోవాలని  ఆర్డీవో కామారెడ్డి, తహసిల్దార్  తాడ్వాయి లకు సూచించారు. అనంతరం లింగంపేట్ మండలంలో  దెబ్బతిన్న లింగంపల్లి  కుర్దు వంతెనను పరిశీలించి ముఖ్యమంత్రి వచ్చే సమయంలో  ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా  చూడాలని, వరద వల్ల బ్రిడ్జి కి కలిగిన డామేజ్ ను  చూపించేలా బాధ్యతలు చూసుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో  పార్థసింహారెడ్డికి సూచించారు. లింగంపేట్  మండలం బుడిగిడా గ్రామంలో దెబ్బతిన్న  వరి పంటను పరిశీలించి ముఖ్యమంత్రికి జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు తెలపాలని  వ్యవసాయ అధికారులకు సూచనలు చేశారు. 
       
అనంతరం కామారెడ్డి పట్టణంలోని జి ఆర్ కాలనీలో  పర్యటించి సీఎం  పర్యటనకు  సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి నిర్వహించనున్న జిల్లా అధికారులతో వరదలపై సమీక్ష, ఫోటో ఎగ్జిబిషన్,  ఏర్పాట్లను పరిశీలించి  ముఖ్యమంత్రి కార్యక్రమం సాఫీగా జరిగేలా అన్ని శాఖల అధికారులు  సమన్వయంతో  పని చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

Read More వికలాంగులకు, చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి

ఈ కార్యక్రమంలో  బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి , జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్,ఆర్ అండ్ బి, మున్సిపాలిటీ, వ్యవసాయ తదితర శాఖల అధికారులు  పాల్గొన్నారు. 

Read More గోర్ సేన ఆధ్వర్యంలో శాంతి యుత ర్యాలీ

About The Author