ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..!
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 12: నిర్మల్ జిల్లా భైంసా లో ఇసుక అక్రమ రవాణాతో వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో సాగు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రధానంగా పెండ్పల్లి పరివాహక ప్రాంతమంతా ఎడారి తలపిస్తోంది.. ప్రస్తుతం అక్రమార్కుల బెడద త ప్పనుంది. సోమవారం సీఎం రేవంత్రెడ్డి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని..రవాణా పర్యవేక్షణ కలెక్టర్, ఎస్పీకి బాధ్యతలు ఇస్తున్నట్లు చెప్పడాన్ని వాగు పరివాహక ప్రాంత రైతులు స్వాగతిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం జిల్లాఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం బైంసాలో ని ఆటోనగర్లో రెవెన్యూ శాఖ మరియు పోలీసు అధికారులు ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.మరియు భైంసా డివిజన్లోని మండలాల పరిధిలో ప్రవహిస్తున్న వాగును అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన వారికే ఇసుక తరలించేందుకు, విక్రయించేందుకు అనుమతి ఉందని.. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. ::అనుమతులు సక్రమంగానే ఉంటాయా? : గతంలోనూ రెవెన్యూ అధికారులు జారీ చేసిన కూపన్ల ఆధారంగానే ఇసుక తవ్వకాలు జరిగేది. వాటి జారీ సమయంలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించిన ఘటనలున్నాయి. దాంతో అక్రమార్కులు తీసుకున్న కూపన్లను చూపిస్తూ ఎక్కువ టిప్పుల ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకొన్నారు. కొంత కాలంగా అధికారుల అనుమతులు ఇవ్వడం రద్దు చేశారు. అయినా అక్రమార్కుల తవ్వకాలు ఆగలేదు. మరీ ఇప్పుడు అనుమతితోనే రవాణా చేయాలనేది సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ అనుమతులు ఇచ్చే అధికారులు నిబంధనల ప్రకారమే ఇస్తారా..? గతంలో మాదిరిగానే చేతివాటం ప్రదర్శిస్తారనే విమర్శలు జోరందుకున్నాయి. ::100కు సమాచారమివ్వండి:: జిల్లాలో అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ అధికారి జానకి షర్మిల మంగళవారం హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా ఇసుక అక్రమంగా తరలిస్తే 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారమివ్వాలని ఎస్పీ కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక నిల్వల వద్ద భద్రత చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి తీసుకొన్న వారికి మాత్రమే ఇసుక తరలించే అవకాశం ఉంటుందన్నారు. గుత్తేదారులమని, ఇతర పేర్లతో లావాదేవీలు జరిపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 12: నిర్మల్ జిల్లా భైంసా లో ఇసుక అక్రమ రవాణాతో వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో సాగు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రధానంగా పెండ్పల్లి పరివాహక ప్రాంతమంతా ఎడారి తలపిస్తోంది.. ప్రస్తుతం అక్రమార్కుల బెడద త
ప్పనుంది. సోమవారం సీఎం రేవంత్రెడ్డి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని..రవాణా పర్యవేక్షణ కలెక్టర్, ఎస్పీకి బాధ్యతలు ఇస్తున్నట్లు చెప్పడాన్ని వాగు పరివాహక ప్రాంత రైతులు స్వాగతిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం జిల్లాఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం బైంసాలో ని ఆటోనగర్లో రెవెన్యూ శాఖ మరియు పోలీసు అధికారులు ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.మరియు భైంసా డివిజన్లోని మండలాల పరిధిలో ప్రవహిస్తున్న వాగును అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన వారికే ఇసుక తరలించేందుకు, విక్రయించేందుకు అనుమతి ఉందని.. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు.
::అనుమతులు సక్రమంగానే ఉంటాయా? :
గతంలోనూ రెవెన్యూ అధికారులు జారీ చేసిన కూపన్ల ఆధారంగానే ఇసుక తవ్వకాలు జరిగేది. వాటి జారీ సమయంలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించిన ఘటనలున్నాయి. దాంతో అక్రమార్కులు తీసుకున్న కూపన్లను చూపిస్తూ ఎక్కువ టిప్పుల ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకొన్నారు. కొంత కాలంగా అధికారుల అనుమతులు ఇవ్వడం రద్దు చేశారు. అయినా అక్రమార్కుల తవ్వకాలు ఆగలేదు. మరీ ఇప్పుడు అనుమతితోనే రవాణా చేయాలనేది సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ అనుమతులు ఇచ్చే అధికారులు నిబంధనల ప్రకారమే ఇస్తారా..? గతంలో మాదిరిగానే చేతివాటం ప్రదర్శిస్తారనే విమర్శలు జోరందుకున్నాయి.
జిల్లాలో అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ అధికారి జానకి షర్మిల మంగళవారం హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా ఇసుక అక్రమంగా తరలిస్తే 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారమివ్వాలని ఎస్పీ కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక నిల్వల వద్ద భద్రత చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి తీసుకొన్న వారికి మాత్రమే ఇసుక తరలించే అవకాశం ఉంటుందన్నారు. గుత్తేదారులమని, ఇతర పేర్లతో లావాదేవీలు జరిపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.
