ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 08: తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం వైరారోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లలితా జ్యువెలరీని ప్రారంభించారు. వీడియోస్ కాలనీలోని రామాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలో గల ఆరోగ్య మాత చర్చి, ఎస్ఆర్ గార్డెన్స్, ఖమ్మం రూరల్ మండలంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్, రాం లీలా ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 08:

తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం వైరారోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లలితా జ్యువెలరీని ప్రారంభించారు. వీడియోస్ కాలనీలోని రామాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలో గల ఆరోగ్య మాత చర్చి, ఎస్ఆర్ గార్డెన్స్, ఖమ్మం రూరల్ మండలంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్, రాం లీలా ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

About The Author