జాతీయ రహదారుల నిర్మాణాలు రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకం..
- రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వెల్లడి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :

సోమవారం హైదరాబాద్ నుండి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లతో కలిసి ముఖ్యమంత్రి, జాతీయ రహదారుల నిర్మాణ పనులు, భూసేకరణ సమస్యలు, పెండింగ్ మ్యుటేషన్, ఫారెస్ట్ క్లియరెన్స్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ, నేషనల్ హైవేస్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణాలతో రవాణా సౌకర్యాల అభివృద్ధితో పాటు వాణిజ్య, పారిశ్రామిక రంగాలు పురోగమిస్తాయని తెలిపారు. రహదారుల నిర్మాణాలు జరుగుతున్న జిల్లాల్లో భూసేకరణ, మ్యుటేషన్, అటవీ అనుమతుల ప్రక్రియలను వెంటనే పూర్తి చేసి, నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పూర్తయిన రహదారులతో పాటు, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పరిహారం చెల్లింపులు తదితర అంశాలను వేగవంతం చేయాలన్నారు. ఎటువంటి కారణాలతోనూ రోడ్ల నిర్మాణంలో ఆటంకాలు తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు.
\అనంతరం జిల్లాల వారీగా భూసేకరణ స్థితిగతులను ముఖ్యమంత్రి చర్చించారు. భూసేకరణ సమస్యలు, న్యాయపరమైన ఇబ్బందులు, పరిహారం చెల్లింపులు, రికార్డుల అప్‌డేషన్ వంటి అంశాలపై కలెక్టర్లు వివరాలు సమర్పించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
