కంప్యూటర్ ఆపరేటర్లకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే మంజూరు చెయ్యాలి 

కంప్యూటర్ ఆపరేటర్లకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే మంజూరు చెయ్యాలి 

సూర్యాపేట జిల్లా బ్యూరో(భారత శక్తి) జూలై 23: సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక మండల ఆఫీస్ నందు పనిచేస్తున్న ఈ-పంచాయతీ అండ్ ఆర్బిఎస్ఏ కంప్యూటర్ ఆపరేటర్లకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే మంజూరు చేయాలని బుధవారం ఎంపీడీఓ, ఎంపీవో లకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలలోని 1579 మంది ఈ-పంచాయతీ అండ్ ఆర్ఎస్ఏ కంప్యూటర్ ఆపరేటర్లుగా మండల స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాము. కాగా రాష్ట్రంలో విధులలో ఉన్న ఈ-పంచాయతీ మరియు ఆర్జిస్ఏ కంప్యూటర్ ఆపరేటర్లకు జనవరి 2025 నుండి వేతనాలు కమీషనర్ కార్యాలయం హైదరాబాద్ ద్వారా పొందుతున్నాము. గతంలో పొందిన మా వేతనం రూ.22750/- కి బదులుగా రూ.19500/- ఖాతాలలో జమ అవుతున్నాయని ఇలా వేతనాలు తగ్గించి ఇవ్వడం వలన ఆర్ధికముగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ-పంచాయతీ మరియు ఆర్ఎస్ఏ కంప్యూటర్ ఆపరేటర్లుగా తాము 2015 నుండి విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమకు ఇంతవరకు ఉద్యోగ భద్రత కాని, ఎలాంటి సౌకర్యాలు కాని కల్పించలేదు.

Read More ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలి

కావున ఇప్పటికైనా మా చిరు ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని గత 10 సంవత్సరాల నుండి మేము ఎదురుచూసె హెచ్ ఆర్ పాలసీని వెంటనే అమలు అయ్యే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపాలని, వెంటనే పెండింగ్ లో ఉన్న ఏప్రిల్-25, మే-25, జూన్-2025 వరకు గల మూడు నెలల వేతనాలు చెల్లించాలని కోరుతున్నట్టు తెలియజేసారు. దానిలో భాగంగానే మా సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి జూలై 23 నుండి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి ఆపరేటర్ల సంఘం తరుపున విధులు బహిష్కరిస్తున్నట్లు తెలియజేసారు.

Read More స్వచ్ఛత హరిత పాఠశాలకు యూనిసెఫ్ సహకారం అవసరం

About The Author