వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జులై 23: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతం. ఈ సందర్భంగా ( పి.డి.ఎస్.యు ) రాష్ట్ర సహాయ కార్యదర్శి జి సురేష్, (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి అరుణ్, ఏ ఐ ఎఫ్ డి ఎస్ కార్యదర్శి జబ్బర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శివ అన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైందన్నారు.

ఈ సందర్భంగా (పి.డి.ఎస్.యు) రాష్ట్ర సహాయ కార్యదర్శి జి సురేష్,(ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు కళాశాలలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని తన దగ్గరే పెట్టుకుని విద్యాసంస్థలను గాలికి వదిలేయడం సరైనది కాదు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థలకు గత సంవత్సరాల తరబడి రావలసిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ 8000 వేల కోట్ల బకాయిలో పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కాలేజీ యజమాన్యాలు ఫీజులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని వేధిస్తున్నారు. 

Read More కాకతీయ గడ్డ నుండే బీసీల రిజర్వేషన్ల ఉద్యమం

గత ప్రభుత్వం మన ఊరు మనబడి అనే కార్యక్రమం పెట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న మూత్రశాలలను, మరుగుదొడ్లను, వంటశాలల పాత బిల్డింగ్ లను కూల్చివేసి కొత్తవి కడతామని చెప్పి వదిలేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలు వేసి కనీసం విద్యార్థులకు అందించవలసిన మూత్రశాలలు, మరుగుదొడ్లనైన నిర్మించకపోవడం వల్ల విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.

Read More నారిశక్తి కార్యక్రమం పై పోలీసు అక్కలతో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల

అమ్మాయిలు అబ్బాయిలు బయటికి వెళ్లడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే భవనాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంట గదులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కార్పోరేట్, ప్రయివేట్ విద్యాసంస్థలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు.

Read More గ్రూప్స్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ లకు ఉచిత శిక్షణ 

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో చట్టాల ప్రకారం ఒక్క ప్రైవేటు, కార్పోరేట్ విద్యా సంస్థలు నడవడం లేదు ఎవరికి వారే ఇష్టానుసారంగా ఫీజుల దందాను చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్య సంస్థలో పకడ్బందీగా అమలు చేయాలి. తదితర డిమాండ్స్ తో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతం కావడం జరిగింది. ఈ బందుకు విద్య సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు మేధావులు ప్రజలు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
  ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More మీరు భయపడ్డారా.. అంతే సంగతులు...

About The Author