విద్యాలయాల్లో రక్షణ ఎక్కడ..?
- ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు..
- నిబంధనల ప్రకారం బిల్డింగ్స్ లేవు..
- మూత్రశాలలు, ఆట స్థలాలు, లైబ్రరీలు లేవు..
- ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ ఎవరూ పాటించడం లేదు..
- పొద్దున్న బడికి వెళ్లిన పిల్లలు తిరిగొస్తారనే నమ్మకం లేదు..
- ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..
- ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఒకవైపు..
- ప్రయివేట్ పాఠశాలల దుర్నీతి ఒకవైపు..
- రాష్ట్రంలో మొద్దునిద్ర పోతున్న విద్యాశాఖ అధికారులు..
- లంచాలు మేస్తూ అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న దౌర్భాగ్యం..
- చదువు మాట అటుంచితే.. ప్రాణాలు మిగులుతాయా అన్న అనుమానం..!
- లెక్కకు మించి భారీ అంతస్తుల్లో పాఠశాలల నిర్వహణ..
- ఈ తీరు మారకపోతే ఉద్యమం చేస్తామని "కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ",
- తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ",
- "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ వుమన్ రైట్స్ సంస్థలు" సంయుక్తంగా హెచ్చరిస్తున్నారు..
చదువుల తల్లి సరస్వతి కొలువై ఉండే పాఠశాలల పరిస్థితి ప్రమాదభరితంగా మారిపోయాయి.. కేవలం అక్రమార్జనే ప్రధాన ధ్యేయంగా సాగుతున్న ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల రక్షణకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.. కనీస వసతులు కూడా లేకుండా పాఠశాలలను నడిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం.. కొందరు తల్లి దండ్రులు పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తున్నా సరైన జవాబు చెప్పేవారు కనిపించడం లేదు.. ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారు అవినీతి అధికారులు.. ఇటు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించలేక, తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు తల్లి దండ్రులు.. వేలల్లో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తును పట్టించుకోకపోవడంతో.. ప్రైవేట్ పాఠశాలలకు పంపించక తప్పదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.. అనేక పోరాటాలు చేస్తున్నారు " తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్
"ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ వుమన్ రైట్స్ సంస్థలు"..
మరి కొన్ని స్కూళ్ళు ఒక చోట ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకుని, మరోచోట వేరొక బిల్డింగ్ లో పాఠశాలల నిర్వహణ కొనసాగిస్తున్నారు.. ఇలాంటి ఉదంతాలు ఎన్నో బయటపడ్డాయి.. కానీ అధికారుల్లో గానీ, పాఠశాలల యాజమాన్యాలలో గానీ మార్పు రావడం లేదు.. పిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తూనే ఉన్నారు.. మరీ దారుణం ఏమిటంటే ఒక పేరుమీద స్కూళ్లకు పర్మిషన్ తీసుకుంటూ, మరో పేరుమీద స్కూళ్ళు నడుపుతున్నారు.. పేరున్న స్కూళ్ల రిసిప్ట్ లు ఇస్తూ చిన్నా చితకా స్కూళ్లను నడుపుతున్నారు.. ఎలాంటి అనుభవం, అర్హత లేనివాళ్లను టీచర్లుగా నియమించుకుంటున్నారు.. అర్హత, అనుభవం ఉంటే ఎక్కువ జీతాలు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా కక్కుర్తి పడుతున్నారు పాఠశాలల యాజమాన్యాలు.. వీరిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు, అధికారులు వారికే దాసోహం అంటున్నారు.. విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారు.. భవిష్యత్ తరాలను బుగ్గిపాలు చేస్తున్నారు..
జిల్లా విద్యాశాఖాధికారి మొదలు కుని, క్రిందిస్థాయి ఉద్యోగులందరూ అవినీతిలో కూరుకుని పోయారు.. ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్లు ఇస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.. విద్యాశాఖ అనేది నిర్వీర్యంగా మారిపోయింది.. కార్పొరేట్లకు అమ్ముడుపోయింది.. ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా ఉంటే ఇలాంటి దుస్థితి ఎదురయ్యేది కాదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు..
ప్రైవేట్ పాఠశాలల నియంత్రించేందుకు సంయుక్తంగా " తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ",
"ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ వుమన్ రైట్స్ సంస్థలు" పోరాటం చేస్తున్నాయి.. మీరూ చేతులు కలపండి పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దుదాం..