మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్

ములుగు జిల్లా ప్రతినిధి, జులై 28 (భారత శక్తి ) : ఇటీవల నూతనంగా ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన రేగ కళ్యాణి ని సోమవారం ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అధ్యక్షతన అసోసియేషన్ నాయకులు  మర్యాదపూర్వకంగా కలిసి మార్కెట్ చైర్మన్ రేగ కళ్యాణికి పుష్పగుచ్ఛం అందించి  శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానం చేశారు.1000002700అనంతరం కళ్యాణి తో బాదం ప్రవీణ్ మార్కెట్ కి సంబందించిన అంశాలపై చర్చించారు.
తదనంతరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేద సారంగం కు మార్కెట్ సెక్రటరీ సోనియా ను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోవిందరావు పేట పిఎసిఎస్ చైర్మన్ ఎల్లారెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సహోదర రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, ఉపాధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. 

About The Author