జీఎస్టీ సంస్కరణలవల్ల జరిగిన నష్టమేంది?

కరీంనగర్ :

కొండా లక్మణ్ బాపూజే తెలంగాణ స్పూర్తి
ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

WhatsApp Image 2025-09-21 at 2.54.53 PM

జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దక్షిణాది వ్యక్తేనని, నిజంగా జీఎస్టీ సంస్కరణలవల్ల ఏదైనా సమస్య ఉంటే ఆమె ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బండి సంజయ్ ఆదివారం జిల్లా పార్టీ అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ 
తెలంగాణ ఉద్యమ పతాక, చేనేత సహకారోద్యమ నేత, భరతమాత ఒంటిపై మెరిసే చేనేత వస్త్రమని, నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబావుటా ఎగుర వేసి తెలంగాణ ఆత్మగౌరవ తిరుగుబాటుకు తొలి బావుటా కొమరం భీమ నడయాడిన ఆదివాసీ మట్టిపూల పరిమళాలు వెదజల్లే నేలపై మెరిసిన పతాక, బడుగు బలహీన వర్గాల స్పూర్తి  ప్రదాత, నిజాయితీకు నిలువుటద్దం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ఇంటినే త్యాగం చేసిన జల ద్రుశ్య ప్రదాత (కేసీఆర్ మొట్ట మొదట పార్టీ పెడతానంటే తన ఇంటినే టీఆర్ఎస్ ఆఫీస్ (జల ద్రుశ్యం) గా మార్చి తెలంగాణ రాష్ట్ర అంకుర్పారణకు చేసిన మహనీయుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరించుకునే అవకాశం వచ్చిందన్నారు.

Read More రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా..?

నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు బాపూజీ అన్నారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన నాయకుడు.  చేనేత, చేతివృత్తుల కార్మికుల కంచంలో అన్నం మెతుకుగా మారిన మానవతావాది, స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ టోపీ పెట్టుకుని  ‘సిటిజన్‌ ప్రొటెక్షన్‌ కమిటీ’ పేరుతో  పౌర హక్కుల కోసం పోరాడి అనేక సార్లు జైలుకు వెళ్లిన యోధుడు బాపూజీ. ఆధిపత్యాన్ని సహించని వ్యక్తిత్వం బాపూజీ సొంతం. తన జీవితమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం అనే లక్ష్యాల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. నిజాం రాజును అంతమొందిస్తే తప్ప హైదరాబాద్‌ సంస్థాన ప్రజలకు విముక్తి లేదని భావించిన బాపూజీ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌పై బాంబు దాడికి వ్యూహం రచించి అమలు చేసిన వ్యూహకర్త. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధించబడిన నాయకులకు పార్టీలతో నిమిత్తం లేకుండా ఉచిత న్యాయ సహాయం అందించిన గొప్ప న్యాయవాది బాపూజీ అని చెప్పారు.  ఉద్యమానికి ఊపిరిలూదిన నాయకుడు కొండా లక్ష్మణ్‌ అని, తెలంగాణ పీపుల్స్‌ పార్టీ’ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటిన బాపూజీ తన నివాసమైన ‘జలదృశ్యం’ లోనే తెలంగాణ రాష్ట్ర సమితికి పురుడు పోశారాని గుర్తుచేశారు. తెలంగాణ తల్లికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం నినందించిన ప్రతి ఒక్కరికీ అండగా నిలిచిన (దేవేందర్‌ గౌడ్‌, ఆలె నరేంద్ర, గద్దర్‌, విమలక్క) మహనీయుడు మన  బాపూజీ కొండా లక్మణ్ జీ అని, 96 సంవత్సరాల పండు ప్రాయంలో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో తెలంగాణ కోసం దీక్ష చేశారంటే బాపూజీకి తెలంగాణపట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే బాపూజీ అన్నారు. విలువలు, త్యాగం, పట్టుదల, నిజాయితీ, పోరాట స్పూర్తి నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. 

Read More ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని

About The Author