మోడల్ స్కూలులో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి కావాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్*
హనుమకొండ :
భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని మోడల్ స్కూల్ సమీపంలో నిర్మించే ఇంకుడు గుంతల నిర్మాణ స్థలం, మోడల్ స్కూలులో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
ములుకనూరులోని మోడల్ స్కూల్ సమీపంలో గ్రామంలోని మురుగు కాలువల ద్వారా వచ్చే మురుగునీరు, వర్షపు నీరు నిల్వ కారణంగా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాలను త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు.
Read More 111 జీఓ పరిధిలో అక్రమ నిర్మాణాలు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ సమీపంలో గ్రామంలో నుండి వచ్చే మురుగునీరు, వర్షపు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని ఇటీవల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించగా వారి ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి పనులను మంజూరు చేయగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇబ్బందికరంగా ఉన్న ముళ్ళ కంపలను తొలగించాలన్నారు. మురుగునీరు నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వెంటనే మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మోడల్ స్కూలులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారుతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి సామగ్రి వివరాలు, బిల్లులు ఎంతవరకు వచ్చాయని కలెక్టర్ అడిగి తెలుసుకుని ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అక్షయపాత్ర నుండి వస్తున్న భోజనం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడి కేంద్రానికి వస్తున్న చిన్నారుల సంఖ్యతో పాటు భోజనం ఎలా ఉంటుందని, సమయానికి వస్తుందా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Read More నేటి భారతం :
About The Author
12 Sep 2025