మణుగూరు ఏరియా మనుగడ కాపాడాలి :పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, మార్చి 22 (భారతశక్తి): మణుగూరు ఏరియా మనుగడకై మణుగూరు ఓసి విస్తరణకు అడ్డంకులు తొలగించి, నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించాలని, సింగరేణి పరిరక్షణకు కొత్త గనులు ప్రారంభించాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, సహకారం, ఆయన సమక్షంలో హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాంకు, జిఎం కో-ఆర్డినేషన్ సయ్యద్ మెహబూబ్ సుభానిలకు శనివారం వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన మణుగూరు ఏరియా కొత్త బొగ్గు గనులు ప్రారంభించకపోవడం ఉన్న గనులకు విస్తరణ అనుమతులలో జాప్యం వెరసి మణుగూరు ఏరియా మనుగడనే ప్రశ్నార్థకంలో పడిందన్నారు. కొత్త గనులు ప్రారంభిస్తే మణుగూరుకు పూర్వ వైభవం సంతరించు కోవడంతో పాటు మణుగూరు ఏరియా డిపెండెంట్ లకు కూడా ఇక్కడే పోస్టింగ్ ఇవ్వవచ్చని ఆయన అన్నారు. కోల్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో కూడా పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక దక్షిణాది పరిశ్రమలకు ఆయువుపట్టు సింగరేణి పరిరక్షణకు మరికొన్ని కొత్తగా ప్రారంభించాలని ఉన్న గనులకు విస్తరణ అనుమతులు సాధించాలని ఆయన ఎండిని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎండి సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతన పెంపుకు చర్యలు చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ సింగరేణి భవన్ లో కలిసిన రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) రాష్ట్ర నాయకులు బి జనప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, మణుగూరు ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎం సురేందర్ రెడ్డి, పి జయపాల్ రెడ్డి, అడపా స్వామి (తాతబ్బాయి) తూపూడి గోవిందు తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు, మార్చి 22 (భారతశక్తి):
మణుగూరు ఏరియా మనుగడకై మణుగూరు ఓసి విస్తరణకు అడ్డంకులు తొలగించి, నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించాలని, సింగరేణి పరిరక్షణకు కొత్త గనులు ప్రారంభించాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, సహకారం, ఆయన సమక్షంలో హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాంకు, జిఎం కో-ఆర్డినేషన్ సయ్యద్ మెహబూబ్ సుభానిలకు శనివారం వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన మణుగూరు ఏరియా కొత్త బొగ్గు గనులు ప్రారంభించకపోవడం ఉన్న గనులకు విస్తరణ అనుమతులలో జాప్యం వెరసి మణుగూరు ఏరియా మనుగడనే ప్రశ్నార్థకంలో పడిందన్నారు. కొత్త గనులు ప్రారంభిస్తే మణుగూరుకు పూర్వ వైభవం సంతరించు కోవడంతో పాటు మణుగూరు ఏరియా డిపెండెంట్ లకు కూడా ఇక్కడే పోస్టింగ్ ఇవ్వవచ్చని ఆయన అన్నారు. కోల్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో కూడా పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక దక్షిణాది పరిశ్రమలకు ఆయువుపట్టు సింగరేణి పరిరక్షణకు మరికొన్ని కొత్తగా ప్రారంభించాలని ఉన్న గనులకు విస్తరణ అనుమతులు సాధించాలని ఆయన ఎండిని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎండి సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికుల వేతన పెంపుకు చర్యలు చేపట్టాలని కోరుతూ హైదరాబాద్ సింగరేణి భవన్ లో కలిసిన రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి) రాష్ట్ర నాయకులు బి జనప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, మణుగూరు ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎం సురేందర్ రెడ్డి, పి జయపాల్ రెడ్డి, అడపా స్వామి (తాతబ్బాయి) తూపూడి గోవిందు తదితరులు పాల్గొన్నారు.