బోనకల్ లో ఘనంగా విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు.

ఖమ్మం బ్యూరో :

WhatsApp Image 2025-09-17 at 5.58.18 PM

ప్రపంచ సృష్టికర్త విశ్వ కర్మ భగవాన్ జయంతి వేడుకలు  బుధవారం మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 329/ 2021 ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమాన్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు రావుట్ల వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి తాటికొండ విసిగ్నాచారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవాన్ కి విశ్వబ్రాహ్మణ  మండల పురోహితులు మోడేపల్లి రామకోట చారి వజ్రాల రాధ కృష్ణమాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి దేవరకొండ రమాదేవి జెండా ఆవిష్కరణ గావించారు. అనంతరం 200 మంది కి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహిస్తారని, సృష్టికి మూలమైన విశ్వకర్మ భగవానుని ఐదు వృత్తి ల వారు తమ కుల దైవంగా కొలుస్తారని, అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి తాటికొండ రవి చారి, జిల్లా నాయకులు పోడకండ్ల తుకారం చారి, జిల్లా గౌరవ అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ చారి, కార్యదర్శి పంతంగి శ్రీనివాసరావు చారి, మండల  గౌరవ అధ్యక్షుడు చిట్యాల రాజయ్య చారి, మండల నాయకులు రావుట్ల లక్ష్మీనారాయణ చారి, బంగారు అప్పలా చారి, చిట్టి నోజు సతీష్ చారి, చిట్టోజు కృష్ణమాచారి, తాటికొండ పుల్లయ్య చారి, తాటికొండ కోటేశ్వరరావు చారి, నంచర్ల నరసింహారావు చారి, మోడేపల్లి విశ్వబ్రాహ్మచారి, వీరబ్రాహ్మణ చారి, ఉల్లి లక్ష్మీనారాయణ చారి,రామడుగు సైదాచారి వెగ్గల వెంకటేశ్వర చారి, సూరోజు పుల్లాచారి, మహిళా మండల అధ్యక్షురాలు చిట్టి నోజు కళ్యాణి, ప్రధాన కార్యదర్శి, పంతంగి రమాదేవి, మండల నాయకురాలు చిట్టోజు దుర్గ, అన్ని గ్రామాల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Read More జాతీయస్థాయి కరాటే పోటీల్లో వేములవాడ విద్యార్థుల అద్భుత ప్రతిభ

About The Author