తూనికలు, కొలతలు శాఖలో పెరిగిన అవినీతి బరువు..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

- ప్రయివేట్ సిబ్బందితో కలిసి ప్రజలను లూటీ చేస్తున్న అధికారులు..
- కరెన్సీలో మోసాలు.. ప్రమాణాలకు విరుద్ధంగా తూకాన్ని పెంచడం.. 
- ముడుపులు అందుకుంటున్న అధికారులు పర్యవేక్షించడం లేదన్నది విమర్శ.. 
- అనధికారంగా వినియోగదారులనుంచి వసూళ్లు చేస్తున్న వ్యాపారస్తులు.. 
- సరైన రశీదులు ఇవ్వకుండా ఇష్టానుసారం డబ్బులు తీసుకుంటున్న వైనం.. 
- లీగల్ మెట్రాలజీ నిబంధనలకు యథేచ్ఛగా తూతూ పొడుస్తున్న దుర్మార్గం.. 
- కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నియంత్రణలో లోపాలు.. సిబ్బంది కొరత.. 
- పలు సమస్యలతో, పెను అక్రమాలు జరుగుతున్నా చర్యలు శూన్యం.. 
- ప్రభుత్వం దృష్టిపెట్టి పరిష్కార మార్గాలు అన్వేషించాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

download

ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, యావత్ భారతదేశమంతటా తూనికలు, కొలతల శాఖలో అవినీతి విస్తృతంగా పేరుకునిపోయింది..   తూనికలు, కొలతల శాఖలో అవినీతి సమస్య వినియోగదారులైన సామాన్య ప్రజలకు ఎన్నెన్నో ఇబ్బందులు, నష్టాలు కలుగజేస్తూవుంది.. ముఖ్యంగా ఆ శాఖలోని కొందరు అవినీతి అధికారులు ప్రైవేటు సిబ్బందిని నియమించుకుని అక్రమాలకు తెరలేపుతున్నారు.. అంతులేని వసూళ్లకు పాల్పడుతున్నారు.. కరెన్సీ లావాదేవీల్లో మోసాలు చేస్తున్నారు.. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా తూకాల్లో ఎక్కువగానే, తక్కువగానీ ఉండేలా అదనపు చర్యలు తీసుకుంటూ ఇబ్బడి ముబ్బడిగా మోసపూరిత చర్యలు చేస్తున్నారని నిర్దిష్టమైన సమాచారం ఉంది. ఇలాంటి కేటుగాళ్లు చిరు వ్యాపారుల నుంచి, వినియోగదారుల నుంచి అనధికారిక వసూలు చేస్తూ, రశీదులు ఇవ్వకుండా డబ్బు తీసుకుంటున్నారు. ఈ విధంగా మోసాలు జరుగుతూ ఉంటే విశిష్టమైన అధికారాలు కలిగిన ముఖ్యమైన అధికారుల పనితీరు, లీగల్ మెట్రాలజీ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమార్జనకు వెనుకేసుకుంటున్నారన్నది స్పష్టంగా అర్ధం అవుతోంది..  కాగా కొన్ని నియంత్రణల లోపాలు, సిబ్బంది కొరత కారణంగా ఈ అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు.. ఈ సమస్యలు ప్రజలను, చిరు వ్యాపారులను వంచనకు గురి చేస్తున్నాయి.. ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయపోరాటం చేయడానికి వెనుకంజ వేయమని హెచ్చరిస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

Read More మత్స్యకారులు మత్స్య సంపదపై దృష్టి సాధించాలి : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

 

Read More సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ

అవినీతి బరువు రోజు రోజుకూ పెరిగిపోతున్న తూనికలు, కొలతల విభాగంలో అవినీతిని నిర్మూలోంచే అంశాలు చాలానే ఉన్నాయి.. వీడితే ఎన్నెన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి.. కానీ చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వాలు, అధికారుల చొరవ అవసరం అన్నది నిర్విదాంశం..  ముఖుంగా అవినీతి నిరోధన కోసం కఠినమైన విచారణలు, పెద్ద ఎత్తున ఆయా అధికారుల మీద చర్యలు తీసుకోవడం చేయాలి.. అధికారుల, సిబ్బంది ప్రమాణాలను పెంపొందించడం, ప్రభుత్వం ఈ వ్యవస్థను బలోపేతం చేయడం జరగాలి..  ప్రైవేటు సిబ్బందితో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా పనిచేయకుండా నియంత్రించటం చేయాలి.. ప్రమాదకరమైన, అక్రమ చర్యలపై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి సమర్థవంతంగా ఆ ఫిర్యాదులపై స్పందించాలి.. 

Read More రసాయన శాస్త్రంలో పనస మహేష్ కు పీహెచ్డీ

అన్ని దుకాణాల్లో, వ్యాపారాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ వీలైనంతగా పెచాలి.. సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీటీవీ, కంప్యూటరీకరణ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరగాలి.. ప్రభుత్వ నియమాలు, ప్రమాణాలు, నిబంధనలపై ప్రజలకు అవగాహన కలిగించాలి.. ఈ విధంగా అవినీతి తగ్గించి, తూనికలు, కొలతల శాఖలో న్యాయం, ప్రామాణికతను పెంపొందించవచ్చు.

Read More పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు


తెలంగాణ రాష్ట్ర తూనికలు, కొలతల విభాగంలో అవినీతికి కారణమైన ముఖ్యమైన విధానపరమైన లోపాలు ఉన్నాయి.. వాటిని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు..  నిర్దిష్ట అవినీతి కార్యకలాపాలను గుర్తించడం, నిరూపించడం కష్టం అవడం వల్ల అవినీతి నిరోధక చర్యలు సమర్ధవంతంగా ఆచరణలోకి రాకపోవడం జరుగుతోంది.. ఈ విభాగంలో ఉన్న నియంత్రణ వ్యవస్థలు, పర్యవేక్షణ వ్యవస్థల లోపాలు, సరైన ప్రమాణాల నిర్ధారణ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.. అధికారుల మధ్య రహస్య ఒప్పొందాలు.. కమీషన్లు తీసుకోవడం.. అక్రమ వసూళ్ల వంటి చర్యల వలన కొంతమంది తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు.. 

Read More సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

ఇక సాంకేతిక పద్ధతుల లోపం అంటే మానవ ఆధారిత రికార్డింగ్స్, లక్షణాల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. దీని వల్ల మోసపూరిత చర్యలు సహజంగానే జరుగుతూ వున్నాయి..  అలాగే ప్రజల నుంచి, చిరు వ్యాపారుల నుంచి ఫిర్యాదులు సమర్థవంతంగా స్వీకరించి, విచారణ చర్యలు త్వరితగతిన చేపట్టకుండా ఉండటం ఒక బలమైన కారణంగా చెప్పుకోవచ్చు.. ఇక అధికారుల కంటే అధికంగా ప్రైవేటు సిబ్బంది లేదా మూడవ వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడి దుర్వినియోగానికి దారి తీస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. అవినీతి నిరోధక చట్టాలు, విధానాలు ఉన్నా అవి అమలులో వైఫల్యం చెందుతున్నాయి.. 

Read More జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం !

ఇక స్థిరమైన, సక్రమమైన ఆడిట్, మానిటరింగ్, ప్రతివేదికల నిర్వహణలో లోపాలు చోటుచేసుకుంటున్నాయి.. నియమాలు, విధానాలు సరిఅయిన పద్దతిలో అమలు అవడం లేదు.. దీంతో అవినీతికి మార్గం సుగమం అవుతోంది.. ఈ లోపాల వల్ల తూనికలు, కొలతల శాఖలో అవినీతి చర్యలు హేతుబద్ధంగా జరగిపోతున్నాయి. ఇవి ప్రభుత్వం దృష్ట్యా, నియంత్రణ పద్ధతుల పరిమితి, జవాబుదారీతనం లేకపోవడంతో మరింత ప్రమాదకరంగా పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.. 

Read More ఎస్జీఫ్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు అల్పోర్స్ ఇ-టెక్నో

తూనికలు, కొలతల విభాగంలో అవినీతి విధానపరమైన లోపాలను గుర్తించడానికి ఉపయోగించే ముఖ్య ఆడిటింగ్ మెట్రిక్స్ లో కూడా అనుమానాస్పద పర్యవేక్షణ కనిపిస్తోంది..  విధానాలు, నియమాలు సక్రమంగా పాటింపబడుతున్నాయా లేదా అనే అంశాన్ని అంచనా వేయటం తప్పనిసరి.. ఇక జరుగుతున్న మోసాలు, తప్పుల్ని గుర్తించడానికి ఉన్న అకౌంటింగ్ లేదా ఇతర ఫైలింగ్ లోపాలను నిశితంగా  పరిశీలించడం చేయాలి.. ఇక ఈ శాఖలో అమలవుతున్న తనిఖీ, పర్యవేక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయా? అవినీతి అడ్డుకునే విధంగా ఉన్నాయా అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.. 

Read More జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చేపట్టిన సుందరీకరణ పనులు దాదాపు పూర్తి..

కొలతలు, మోతాదులు సరిగా నమోదు అవుతున్నాయా, డేటా సమయానికి అప్డేట్ అవుతుందా అనే విషయం కూడా ఎంతో ముఖ్యమైన విషయం..  సంబంధిత దస్త్రాలు, రసీదులు, లావాదేవీల సరిచూడటం, ఏవిడ్ మోసపూరిత చర్యలు ఉన్నాయా అనేది పరిశీలించడం జరగాలి..  అందిన ఫిర్యాదులను ఖచ్చితంగా పరిశీలించి, వాస్తవ సమస్యలకు స్పందించి శీఘ్ర పరిష్కారాలు చేస్తున్నారా అనేది కూడా ముఖ్యమైన అంశంగా ప్రభుత్వం భావించాలి.. 

Read More కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆవాల సరోజ మృతి

ఇక సీసీటీవీలు, ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా పరిశీలనలు జరుగుతున్నాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది.. సిబ్బందికి సరైన శిక్షణ, సిబ్బంది నైపుణ్యాలు, నియమావళి పాటింపులో మేధావుల సూచనలు తీసుకుని వాటిని అమలు చేస్తూ ప్రమాదాలను తగ్గించవచ్చు.. 
ముఖ్యంగా ఆడిట్ నివేదికలు పూర్తి రూపంలో ఉన్నాయా లేదా..? సంబంధిత నిబంధనలు పాటిస్తున్నారా లేదా..? అన్నది మానిటరింగ్ చేయాలి..  

Read More క్రీడలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం

ఈ ఆడిటింగ్ మెట్రిక్స్ ద్వారా అవినీతి పరిస్థితుల గుర్తింపు, నివారణకు ప్రాముఖ్యతనిచ్చే చర్యలను సులభంగా అమలు చేయవచ్చు అన్నది విశ్లేషకుల సూచన..  తెలంగాణ తూనికలు, కొలతల విభాగానికి ప్రత్యేకంగా 6-8 ప్రాథమిక ఆడిటింగ్ మెట్రిక్స్ సూచనలు ఇలా ఉన్నాయి.. 

కొలతలు, తూనికలు సరైన ప్రమాణాల ప్రకారం జరుగుతున్నాయా అన్నది తనిఖీ చేయాలి.. అనధికారిక లేదా తప్పుడు  లావాదేవీలు జరుగకుండా చూడటం.. ఎలాంటి అనుమతి లేకుండా వసూలు చేసిన కేసుల సంఖ్యను గుర్తించాలి.. ప్రజలనుంచి, వ్యాపారులనుంచి వచ్చే ఫిర్యాదులకు వేగంగా స్పందించడం, పరిష్కారం చూపడం జరగాలి.. ఇక మరీ ముఖ్యంగా ఆడిట్ లో ఎన్ని విధానపరమైన లోపాలు, అప్రామాణికతలు చోటుచేసుకుంటున్నాయి గుర్తించగలగాలి.. ఈ శాఖలో పనిచేసే సిబ్బందికి సరైన  అవగాహన, శిక్షణ ఇవ్వాలి.. ఇక సీసీటీవీలు, డిజిటల్ పరికరాలు వాడకం పెంచాలి.. ఇలాంటి అతి ముఖ్యమైన మార్గదర్శకాలు, పాటించడం మూలాన అవినీతి గుర్తింపు, నివారణకు వీలు కల్పిస్తాయని " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " సూచిస్తోంది.. 

About The Author