సీఎంఆర్ఎఫ్ లో జరిగిన అక్రమాల విషయంలో 8 మంది అరెస్టు
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ
సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలలో అక్రమాలకు పాల్పడిన 8 మందిని అరెస్టు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.నిందితుల నుండి 34.8 లక్షల విలువైన 51 చెక్కులతోపాటు దుర్వినియోగం చేసిన 7 చెక్కులకు సంబంధించి రూ. 7.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. లబ్ధిదారులకు చేరాల్సిన నిధులను పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఇంకా ఎంతమంది పాత్ర ఉంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సమావేశంలో పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...
Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..
About The Author
18 Oct 2025