నేటి భారతం :
ఒక వ్యక్తిని అంచనావేయడంలోనే
నీ వివేకం బయటపడుతుంది..
ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు
నాలుగు రకాలుగా మాట్లాడుతాడు..
నాలుగు విధాలుగా ప్రవర్తిస్తాడు..
అదే బాధలో ఉన్నవాడు
ఎంతో భావంతో మాట్లాడతాడు..
ప్రేమతో జీవించేవాడు చనువుతో మాట్లాడతాడు..
ఇక కోపంతో ఉన్నవాడు కేకలేస్తూ మాట్లాడతాడు..
మంచివాడు మార్పుకోసం మాట్లాడతాడు..
నీమీద అసూయతో ఉన్నవాడు నిన్నెప్పుడూ
చులకనగా మాట్లాడతాడు..
అదే జ్ఞానం ఉన్నవాడు మౌనంగా
ఎంతో ఆలోచించి మాట్లాడతాడు..
నిజానికి మాట మనిషిని మారుస్తుంది..
మౌనం మనసును మారుస్తుంది..
నీ ఎదురుగా ఉన్నవారు ఎలాంటి వారో
నువ్వు గమనించగలిగితే నీ మార్గం
సుగమం అవుతుంది..
ఇప్పటినుంచే ఎదుటివారిని
అంచనా వేయడం నేర్చుకోండి..
అలవాటుగా మార్చుకోండి..
Read More ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..
About The Author
18 Oct 2025