నేటి భారతం :
అదృష్టం అంటే ధనం, ఆస్తులుండటంకాదు
చేతి నిండా పని , కడుపునిండా తిండి,
కంటి నిండా నిద్ర, కష్టసుఖాలను పంచుకునే
సన్నిహితులుండటమే
ఒకే ఒక్క రోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ
విరబూసి నవ్వుతూ ఉంటే...
నూరేళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా ?
బ్రతికేద్దాం నేస్తమా.... ఉన్నది ఒక్కటే జీవితం
“నీ జీవితమే నీకు టీచర్. నీ జీవనగమనంలో అది
నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది”
” ఒక పని గురించి ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఉంటే...
దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు.”
“నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే.. సమయాన్ని
వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని
నిర్దేశిoచేది సమయమే “
“ఓటమి అనేది ఒక ఆలోచన.. వాస్తవంగా
అంగీకరించనంతవరకు ఓటమి ఎవరిని ఓడించలేదు...”
మనసు ఎంత నిర్మలంగా ఉంటే...
దానిని నియంత్రించడం అంత సులభం.
Read More నేటి భారతం :
About The Author
02 Sep 2025