సంగారెడ్డిలో అంబరాన్నింటిన దసరా సంబరాలు
సంగారెడ్డి :
- వచ్చే ఎన్నికల్లో నిర్మల జగ్గారెడ్డి ఎమ్మెల్యే కాండేట్
- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- దసరా వేడుకల్లో ప్రకటన
- ప్రజలను ఉర్రూతలూగించిన సినీ సంగీత విభావరి
- ఆటపాటలతో దద్దరిల్లిన సంగారెడ్డి పట్టణం
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ మైదానంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జంబి పూజ కార్యక్రమాలను నిర్వహించి పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ సంగీత విభావరి కార్యక్రమంలో కళాకారులు సినీ గీతాలను ఆలపించి పట్టణ ప్రజలను అలరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉండానని, తన భార్య టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఎమ్మెల్యే కాండేట్ గా పోటీలో ఉంటారని ప్రకటించారు. మరో 10 సంవత్సరాల వరకు తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. సమాజంలోని యువతలో మార్పు రావాలని పిలుపునిచ్చారు. సన్మార్గం వైపుగా యువత పయనించాలని, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చేలా కష్టపడాలన్నారు. యువత సరైన దిశగా పయనించాలని అన్నారు. ఎన్నికలకు మరో మూడు సంవత్సరాల సమయం ఉందని పని చేసే వారికే పట్టం కట్టాలని తెలిపారు. సంగారెడ్డిని అన్ని రంగాలలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ముందుకెళ్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలన్నారు. ఓట్లు అడగడం లేదని చేసిన అభివృద్ధిని మాత్రమే చెబుతున్నానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానిక రామాలయంలో నిర్మల జగ్గారెడ్డి దంపతులు దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వాసవి మా ఇల్లు అధ్యక్షులు తోపాజి అనంత కిషన్, కూన సంతు, స్థానిక నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.