స్విమ్మింగ్ కోచ్ ను నియమించాలని డి వై ఎస్ ఓ ఖాసిం బేగ్ కు వినతి పత్రం
సంగారెడ్డి :
సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని సిమ్మింగ్ ఫుల్ లో సిమ్మింగ్ కోచ్ లేక స్విమర్స్ ఇబ్బందులకు గురవుతున్నారని మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ డి ఎస్ ఏ కార్యాలయంలో డివైఎస్ఓ కాసిం బేగ్ కు పేరెంట్స్ వినతి పత్రం అందజేశారు.రాజీవ్ పార్క్ పక్కన గల స్విమ్మింగ్ పూల్ లో ప్రతిరోజూ అనేకమంది విద్యార్థులు, యువకులు ఈత నేర్చుకోవడానికి వస్తుంటారని, ప్రస్తుతం శిక్షణ ఇచ్చే కోచ్ లేకపోవడంతో వారికి సరైన మార్గదర్శకత్వం అందడం లేదని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. స్విమ్మింగ్ క్రీడలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న స్విమర్స్ ఇక్కడ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అనుభవజ్ఞుడైన కోచ్ అవసరమని అన్నారు.ఈ నేపథ్యంలో వెంటనే అర్హత కలిగిన స్విమ్మింగ్ కోచ్ ను నియమించి, క్రీడాకారుల భవిష్యత్తుకుఉపయోగపడేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డి.వై.ఎస్.ఓ ఖాసిం బేగ్ ను కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెంటనే నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించిన కాసిం బేగ్.ఈ కార్యక్రమంలో పేరెంట్స్ మహమ్మద్ సిద్ధీఖ్, మహమ్మద్ పర్వేజ్, పంతులు హరి శర్మ, మసూద్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్, అజయ్, సంతోష్ ,మహమ్మద్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.