
స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా నేడు కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన జిల్లా లోని నాలుగు అసెంబ్లీ ల వారిగా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్న కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అయ్యే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుందని, అవకాశం ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనీ సూచించారు. ఒక వేళ రిజర్వేషన్ కారణంగా పోటీ చేసే అవకాశం లేని వారు గెలిపించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ కార్యకర్తలు ఇప్పటి నుండే ప్రజల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను, బీజేపీ సిద్ధాంతాలను, నరేంద్ర మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.