
సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలసి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ తో కూడిన వినతి పత్రం అందజేశారు.నియోజవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు ,రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.
మొత్తం 20 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఎమ్మెల్యేకి 40 శాంతం మంజూరు నిమిత్తం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం , ఎమ్మెల్యే ద్వారా పంపిన లబ్ధిదారుల ప్రతిపాదనలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి సూచించిన ఎండర్స్ మెంట్ లేఖను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు అందజేశారు.వెంటనే తగు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపినారు.మున్సిపాలిటీలలో టి యు ఎఫ్ ఐ డి సి కింద మంజూరు అయినా పనులు వేగవంతంగా చేపట్టుటకు కోరినారు.రెండు మున్సిపాలిటీల్లో మొన్న కురిసిన వర్షాలకు అధిత మొత్తంలో రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వాటిని గుర్తించి వెంటనే పనులు చెప్పుటకు అంచనాలతో కూడిన వినతి పత్రం అందజేశారు.నీటి సమస్యలు రాకుండా చూడాలని , అత్యవసర పరిస్థితిలో నీటి సౌకర్యం ఏర్పాటు కోసం మరమ్మత్తు లు చేపట్టాలని సూచించారు.ఫసల్వాది డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణమునకు రూ. 81.50 లక్షలతో ప్రతిపాదనలు.మరియుx అంతర్గత డ్రైనేజీ వ్యవస్థని కూడా ఏర్పాటు చేయుటకు గాను రూపాయలు కోటి 36 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించినారు. మల్లెపల్లి నుంచి హరిదాస్ పూర్ కు చేపడుతున్న రోడ్డులో భాగంగా తెర్పోల్ గ్రామంలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలుసమర్పించినారు.సదాశివపేట పట్టణంలోని ఫెయిర్ ప్రైస్ షాపులను రేషనలైజేషన్ చేయుటకు గాను ప్రతిపాదనను సమర్పించారు.
ఎందుకనగా ఒక ఫెయిర్ ప్రైస్ షాపులలో 300 మంది ఉంటే ఒక ఫెయిర్ ప్రైస్ లో వెయ్యికి పైగా కార్డు హోల్డర్స్ ఉండడం వలన అధిక పనిబారంతో ప్రజలకు సత్వరమే సేవలందించుటలో జాప్యము జరుగుతున్నందున దీనిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే ఫెయిర్ ప్రైస్ రేషనలైజేషన్ చేయుటకు గానుప్రతిపాదించారు...మరియు జనాభ దృష్టిలో ఉంచెకొని నూతన ఫెయిర్ ప్రైస్ షాపుల ఏర్పాటుకు ప్రతిపదించారు. కంది మండలం బేగంపేట గ్రామంలో ఫిషర్మెన్ కోపరేటివ్ సొసైటీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి సర్వేనెంబర్ 249 నుండి 1000 గజాలు కేటాయించకుగాను ప్రతిపాదనలు అందజేశారు.
ఎమ్మెల్యే వెంట మాజీ సి డి సి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, అక్బర్ తదితరులు ఉన్నారు.