రసాయన శాస్త్రంలో వెంకన్న గుజ్జకు పీహెచ్ డీ

సంగారెడ్డి :

WhatsApp Image 2025-10-06 at 2.53.56 PM

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వెంకన్న గుజ్జ డాక్టరేట్ కు అర్హత సాధించారు. సంభావ్య చికిత్సా ఏజెంట్లుగా నూతన ట్రయాజోలైల్టెట్రాజోల్, ట్రయాజోల్, ఆక్సాడియాజోల్ హెటెరోసైక్లిక్ ఉత్పన్నాల రూపకల్పన, సంశ్లేషణ, జీవసంబంధమైన స్ర్కీనింగ్, ఇన్ సిలో అధ్యయనాలు చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.శివకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ వెంకన్న పరిశోధన ఇండజోల్ ను కలిగి ఉన్న వినూత్న ట్రయాజోల్, టెట్రాజోల్ ఉత్పన్నాల సంశ్లేషణతో కూడుకుని, గణనీయమైన జీవసంబంధమైన కార్యకలాపాలను ప్రదర్శించినట్టు తెలియజేశారు. వాటిని ఔషధ రసాయన శాస్త్రంలో విలువైన స్కాఫోల్డ్ (పరంజా)లుగా చేసిందన్నారు. ఆయన అధ్యయనాలు క్వినోలోన్ ప్రత్యామ్నాయ ట్రయాజోల్ ఉత్పన్నాలు, నూతన ఆక్సాడియాజోల్-క్వినాజోలినోన్ అనలాగ్ లను కూడా అన్వేషించినట్టు తెలిపారు. వీటిలో కొన్ని ఎస్. న్యుమోనియాకు వ్యతిరేకంగా అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ సామర్థ్యాన్ని, శక్తివంతమైన టోపోయిసోమెరేస్-II నిరోధక కార్యకలాపాలను చూపించాయన్నారు. ప్రొలిఫెరేటివ్ వ్యతిరేక ఏజెంట్లుగా వాటి సామర్థ్యాన్ని చాటినట్టు తెలియజేశారు. డాక్టర్ వెంకన్న సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవ ప్రపంచ ప్రభావంతో అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించడంలో గీతం నిబద్ధతకు ఈ మైలురాయి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. 

Read More నేటి భారతం :

About The Author