సమాచార హక్కు చట్టం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
: అదనపు కలెక్టర్ సి హెచ్ మహేందర్ జి.
ములుగు జిల్లా ప్రతినిధి :

సమాచార హక్కు చట్టం పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిర లో నిర్వహించిన సమాచార హక్కు చట్టంవారోత్సవాలలో నిర్వహించిన
శిక్షణకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సి.హెచ్ మహేందర్ జి హాజరై మాట్లాడారు. ఈ నెల 5 నుండి 12 వరకు అధికారులు సమాచార హక్కు వారోత్సవాలను జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించాలని అధికారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పి.ఐ.ఓ.లు, ఎ.పి.ఐ.ఓ.లు, ట్రైనర్ హమీద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
15 Nov 2025
