స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్దం కావాలి : శెట్టి రంగారావు
ఖమ్మం బ్యూరో :
ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామంలో రఘునాథ పాలెం మండల కన్వీనర్ వాoకుడోతు దీపానాయక్ అధ్యక్షతన సోమవారం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మూడు గ్రామాల నుంచి పువ్వాడ నగర్, శివాయిగూడెం, మంచుకొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఇంఛార్జి కాంగ్రెస్ జిల్లా నాయకులు శెట్టి రంగారావు మాట్లాడుతూ..... మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మనమంతా ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ మూడు గ్రామాల్లో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. శివాయిగూడెం గ్రామ ఇంఛార్జి సయ్యద్ అల్సాధ్ , పువ్వాడ ఉదయ నగర్ గ్రామ ఇంఛార్జి కమతం రామకృష్ణ మరియు కాంపాటి వెంకన్న పాల్గొన్నారు. అదే విధంగా పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామం నుంచి బి ఆర్ ఎస్ ఉప సర్పంచ్ మరియు వారితో పాటు ఒక 10 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో శెట్టి రంగారావు, దీప్లా నాయక్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. మంత్రి తుమ్మల అభివృద్ధిని చూసి ఆకర్షితులయ్యి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు భూక్యా బాలాజీ, షేక్ సిద్దిక్ , రాయల మోహనరావు, రాయల శ్రీనివాసరావు, జక్కం స్వాతి, జ్యోతి, లీల, గార్లపాటి ముత్తయ్య, గుగులోత్ బాలాజీ, బాబులాల్, బానొత్ దశరధ్ మరియు వాంకుడోత్ బాషా తది తరులు పాల్గొన్నారు.