స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించండి

సూర్యాపేట :

జిల్లాలో 9 జడ్పీటీసీలు, 56 సర్పంచ్,59 ఎంపీటీసీ స్థానాల్లో సిపిఎం పోటీకి  సిద్ధం 
సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

WhatsApp Image 2025-10-06 at 3.43.55 PM

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.  సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూస్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించేందుకు లౌకిక పార్టీలతో అవగాహన చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. ప్రస్తుతం చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికల అవగాహనకు లౌకిక పార్టీలుకలిసి రాకపోతేవామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగుతామన్నారు.ఈ ఎన్నికల్లో తమ పార్టీ బలమైన ప్రాంతాలలో పోటీ చేస్తామన్నారు.జిల్లాలో 9 జడ్పిటిసి, 56 సర్పంచ్, 59 ఎంపీటీసీ స్థానాల్లో బరిలో బరిలో దిగుతామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు. 

Read More ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి..

About The Author