నేడు మహా పాదయాత్ర
సంగారెడ్డి :
30 మంది అయ్యప్ప స్వాములతో సంగారెడ్డి సంగారెడ్డి పాత బస్టాండ్‌లోని నవరత్న ఆలయం నుండి శబరిమల శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి మూడవసారి మహా పాదయాత్ర ప్రారంభమవుతోంది.. ఈ యాత్ర సుమారు 1600 కిలోమీటర్లు శంకర్పల్లి మీదుగా తిరుపతి చేరుకొని వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని అక్కడినుండి కాణిపాకం సిద్ధి వినాయకుని దర్శనం చేసుకుని అక్కడనుండి అరుణాచలం గిరి ప్రదర్శన చేసుకుని శబరిమల కొండకు పయనమవుతారు. సుమారు 30 మంది అయ్యప్ప స్వాములు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి, అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కోరుకోనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని నిర్వాహకులు గురుస్వామి సాహితీ రాము తెలిపారు. ఈ సందర్భంగా భక్తులందరూ హాజరై, స్వామి ఆశీస్సులు పొందాలని ఆయన ఆహ్వానించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.