ఖమ్మం  (భారత శక్తి ప్రతినిధి ), జూలై 28:

మండల పరిధిలోని పెద్దబీరవల్లి గ్రామానికీ చెందిన చట్టు మాధవి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఆర్ధిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో మంజూరైన 60వేల రూపాయల1000002741 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పిట్టల నాగేశ్వరరావు,ఉసికల రమేష్,గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉసికల సురేష్,గ్రామ కాంగ్రెస్ పార్టీ పిట్టల దుర్గారావు,డేగల వేలాద్రి,యూత్ కాంగ్రెస్ నాయకులు జేవి రత్నం స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందజేశారు.సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని,మేలు చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ప్రజా ప్రభుత్వాన్ని మర్చిపోరాదని లబ్ధిదారులకు వారు సూచించారు.