1000002719
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి )జూలై 28:
సీజనల్ వ్యాధులపై ప్రజలకి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో గ్రామాలలో, వార్డులలో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేయాలని అన్నారు.ప్రజావాణి అర్జీలకి అధిక ప్రాధాన్యతనివ్వాలని ప్రతి అర్జీకి  సంబంధించి ఖచ్చితమైన సమాధానంతో కూడిన కాపీని అర్జీదారునికి పంపాలని తెలిపారు. అలా చేయకపోతే ప్రజలు ఒకే సమస్యకి మరల ధరఖాస్తు చేయటం జరుగుతుందని తెలిపారు.
 
ప్రజావాణి లో భూ సమస్యలకి సంబంధించి  107 ధరఖాస్తులు, పంచాయతీ రాజ్ శాఖకి 11దరఖాస్తులు, మున్సిపల్ కమిషనర్లకి 9 ధరఖాస్తులు,ఇతర శాఖలకి సంబంధించి 19 దరఖాస్తులు వచ్చాయని ప్రజావాణి లో మొత్తం 146 ధరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించుటకి సంబంధిత అధికారులకి పంపించటం  జరిగిందని జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు,డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, డి ఈ ఓ అశోక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డి సి ఓ పద్మ, డి ఎస్ ఓ మోహన్ బాబు,సంక్షేమ అధికారులు దయానంద రాణి, శ్రీనివాస నాయక్, శంకర్,జగదీశ్వర రెడ్డి, కలెక్టరేట్ ఏ ఓ సుదర్శన్ రెడ్డి, సూపర్డెంట్లు సాయి గౌడ్,సంతోష్ కిరణ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.