కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూలై 23: నిర్మల్ జిల్లా వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపించే కాలానుగుణ వ్యాధులపై వైద్యులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. 

బుధవారం పట్టణంలోని బంగల్ పేట్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాల కారణంగా రోగుల సంఖ్య పెరిగే అవకాశముందని, అలాంటి పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరై, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

Read More శ్రీ సంతోషిమాత దేవాలయం లో అమ్మవారలకు వడిబియ్యం.

ఆసుపత్రి పర్యటన సందర్భంగా రోగుల నమోదు, రోగనిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ వంటి అంశాలపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించి, వాటిని సమగ్రంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మందుల గదిని పరిశీలించి, అందుబాటులో ఉన్న ఔషధాల వివరాలు, గడువు తేదీలను తెలుసుకున్నారు. టీకాల గదిని తనిఖీ చేసారు.

Read More విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి-

పారిశుద్ధ్యం విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ హాస్పిటళ్లలు ధీటుగా అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వారికి భరోసా ఇచ్చారు.ఈ తనిఖీలో జిల్లా వైద్యాధికారి డా. రాజేందర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం తనిఖీ

About The Author