ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్,అంగన్వాడి కేంద్రాల్లో మెను అమలుపర్చాలి

ప్రాధమిక స్థాయి లోనే విద్యార్థులకి తెలుగు, ఇంగ్లీష్ బాషలపై పట్టు సాధించాలి.... జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్,అంగన్వాడి కేంద్రాల్లో మెను అమలుపర్చాలి

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారతశక్తి) జూలై 23: ప్రభుత్వ హాస్పిటల్ లో సాధారణ ప్రసవాలు పెంచేలా వైద్య అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణం లోని అంబేద్కర్ నగర్ అర్బన్ పి హెచ్ సి, ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకక్ష్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఎన్ సి రిజిస్టర్, ఎనిమియా కేసుల వివరాలు అడిగి తెలుసు కున్నారు. ప్రసూతి ల వివరాలు వారికి అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. ఫార్మసీ స్టోర్ నందు ఉన్న డ్రగ్స్ వివరాలు అడిగి తెలుసు కున్నారు.1700 మంది హైపర్ టెన్షన్ కేసులు తమ పరిధిలో ఉన్నారు అని సిబ్బంది కలెక్టర్ కి వివరించారు. తదుపరి కలెక్టర్ ట్రైబల్ బాలుర వసతి గృహంలో ఉన్న బియ్యం, వాటర్ టాప్ లుపరిశీలించారు.

Read More మాదక ద్రవ్యాల నిర్మూలన మన అందరి సామాజిక బాధ్యత

విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.అలాగే విద్యార్థులు లైబ్రరీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్ళి హాజరు వివరాలు పరిశీలించారు. పిల్లలు రోజు అంగన్వాడీ కి వచ్చేలా చూడాలని సూచించారు. ఈరోజు వచ్చిన పిల్లల పేర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుడ్లు, బియ్యం, వంట సామాగ్రి ఈ సందర్బంగా కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెను అమలు పర్చాలని సూచించారు.

Read More విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు క్యాష్ రివార్డు

తదుపరి గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ సందర్శించి 1,2 వ తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థులచే ముచ్చటించారు. అలాగే 5 వ తరగతి గదిలో జరుగుతున్న ఇంగ్లీష్ సబ్జెక్ట్ పై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి చదివించారు. విద్యార్డులు మంచిగా చదవటంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసిప్రాధమిక స్థాయి నుండే విద్యార్డులు తెలుగు, ఇంగ్లీష్ భాష లపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టారు కరుణ రాణి, నవ్య, వార్డెన్ కోటేష్, అంగన్వాడీ టీచర్ పద్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More అల్ఫోర్స్ లో ఉత్కంఠ భరితంగా సీబీఎస్ఇ క్లస్టర్ 7 టేబుల్ టెన్నిస్ పోటలు

About The Author