బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి

సంగారెడ్డి :

WhatsApp Image 2025-10-07 at 6.17.03 PM

సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు పనులను టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పరిశీలించారు.రోడ్డు పనులు ఆలస్యం పై అసహనం వ్యక్తం చేశారు. పనుల జాప్యానికి కారణాలను హెచ్ఎండిఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు కరెంటు స్తంభాలు వల్ల రోడ్డు పనులు జాప్యం జరుగుతుందని అన్నారు. డిప్యూటీ ఇంజినీర్,ఎలక్ట్రిసిటీ ఫారెస్ట్ అధికారులను స్వయంగా పరిశీలనకు తీసుకెళ్లి తగు సూచనలు చేశారు. పనులు వేగంగా చేయాలని ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. బై పాస్ రోడ్డులో నాలుగు జంక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ ఏఈ వెంకన్న,ఎలక్ట్రిసిటీ  ఆడిఈ లక్ష్మన్, ఆర్ అండ్ బి డిఈ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ డి ఈ రఘు, ఫారెస్ట్ అధికారులు, నియోజకవర్గ ఇంచార్జి జూలకంటిఆంజనేయులు,సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి,నాయకులు తోపాజి అనంత కిషన్,కూన సంతోష్,షఫీ, కిరణ్ గౌడ్, మహేష్, వెంకట్రాజు, ఉదయభాస్కర్,విక్రాంత్ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More సాహితీ రాము స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర

About The Author